మాఫియా డాన్ లా ముఖ్యమంత్రి

నెల్లూరు:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు  తన పార్టీ అనుచరులతో అక్రమాలు చేయిస్తూ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని..నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి  విమర్శించారు. కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని  ప్రసన్నకుమార్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Back to Top