సేవ చేసే భాగ్యం కల్పించండి..!

వరంగల్ః ఓరుగల్లు ప్రజలు అత్యంత చైతన్యవంతులని వైఎస్సార్సీపీ స్థానిక పార్లమెంట్ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. బై ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని, తనకు సేవ చేసే భాగ్యం కల్పించాలని సూర్యప్రకాశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి, వైఎస్. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే..అది రాజన్న రాజ్యంతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. 

ప్రియతమ నేత  వైఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి సువర్ణ పాలన అందించారని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన గొప్ప నాయకుడని సూర్యప్రకాశ్ కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి పరిపాలన తిరిగి రావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి పరిపాలన గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం కొనసాగిస్తామన్నారు.  పోటీ చేసే అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వైఎస్ జగన్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు సూర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. 
Back to Top