ఫ్యాన్ గుర్తుకే మన ఓటు..!

వరంగల్ః వరంగల్ లోక్ సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి  నామినేషన్ వేశారు. ఈనెల 21న జరగనున్న వరంగల్ బై ఎలక్షన్ లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నల్లా సూర్యప్రకాశ్ ను అభ్యర్థిగా ప్రకటించడం జరగిందని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  తెలంగాణ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు ఇతర జిల్లాల నేతలు, కార్యకర్తలు బతుకమ్మ,బోనాలు, డప్పు వాయిద్యాలతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి పరిపాలన రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని పొంగులేటి స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థులు, యువకులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారికి మేలు చేసిన నాయకుడు వైఎస్ . రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ప్రతి పేదవాని మొములో చిరునవ్వు చూడాలన్నదే వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ఆశయం అన్నారు. మన బతుకులు బాగుపడాలన్నా, రాజన్న కలలు నెరవేరాలన్నా మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ-బీజేపీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నల్లా సూర్యప్రకాశ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Back to Top