'నల్గొండకు మహానేత వైయస్ ఎంతో చేశారు'

నల్గొండ : వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిదేనని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ‌పేర్కొన్నారు. నల్గొండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఎ‌ల్‌బిసి సొరంగమార్గానికి వైయస్‌ఆర్ రూ.1900 కోట్లు కేటాయించి మొదటి దశ పనులు పూర్తి చేశారన్నారు. ‌ఎఎంఆర్‌పికి రూ.6200 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. శ్రీరాంసాగర్, ‌ఎఎంఆర్‌పి ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించిందీ వైయస్సే అని కొనియాడారు.

అయితే, కొంత మంది జిల్లాకు చెందిన నాయకులు మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ చేసిన సేవలపై అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని సంకినేని అన్నారు. జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం తగదన్నారు.

ఏ ప్రాజెక్టు నుంచి ఏ గ్రామానికి నీరు వెళ్తుందో కూడా తెలియని వాళ్లు కూడా‌ మహానేత వైయస్‌ఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం అర్థరహితమని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం సొరంగమార్గం ద్వారా జిల్లాకు సాగు, తాగు నీరు అందించడానికి 1964లోనే రూపకల్పన చేశారని, అప్పటి నుంచీ ఏ ముఖ్యమంత్రీ దానికి నిధులు కేటాయించలేదని ఆయన తెలిపారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సొరంగమార్గానికి నిధులు కేటాయించి మొదటి దశ పనులు పూర్తి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు‌ పలికారు.

‌ఫ్లోరిన్‌తో బాధపడుతున్న నల్గొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు అందించింది వైయస్‌ఆర్ అని సంకినేని గుర్తుచేశారు. దమ్ముంటే ఈ విషయాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా కన్వీన‌ర్ వేణు, తిప్పర్తి, నల్లగొండ మండలాల పార్టీ కన్వీనర్లు యాదయ్య, పుచ్చకాయల సతీ‌ష్‌రెడ్డి, రణదీప్ పాల్గొన్నారు.‌

తాజా వీడియోలు

Back to Top