<strong>హైదరాబాద్, 10 మార్చి 2013:</strong> పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా నల్గొండ, కరీంనగర్ జిల్లాల నుంచి 300 మంది పార్టీలో చేరారు. నల్లగొండ జిల్లా గుండాల మండలం తేరియాలలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ జెండాను జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చామల భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 200 మంది వైయస్‌ఆర్‌సిపి సభ్యత్వం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో జిల్లా అధికార ప్రతినిధి ఐలు రమేష్ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.