నల్గొండ ధర్నాలో పాల్గొననున్న విజయమ్మ

హైదరాబాద్ 30 మార్చి 2013:

విద్యుత్తు సమస్యపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యుక్తమవుతోంది. ఇందుకోసం పటిష్ఠమైన కార్యాచరణను రూపొందించుకుంది. ఏప్రిల్ మూడో తేదీన నల్గొండ నిర్వహించనున్న ధర్నాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పాల్గొంటారు. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి నుంచి 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకూ వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రజా బ్యాలట్ పార్టీ నిర్వహించనుంది. విద్యుత్తు సరఫరా అంశంపై రూపొందించిన ప్రశ్నావళితో మండల, నియోజకవర్గ కేంద్రాలే కాకుండా.. గ్రామాల్లో కూడా అభిప్రాయ సేకరణ చేయనున్నది. 9వ తేదీన రాష్ట్ర బందుకు కూడా పార్టీ పిలుపునిచ్చింది.

Back to Top