టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి సహకారం లేదు

నెల్లూరు:  టీడీపీ ప్రభుత్వం నుంచి చేనేతలకు ఎలాంటి సహకారం లేదని, గిట్టుబాటు ధర లేదని చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు విమర్శించారు. కలిచేడు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గతంలో హెల్త్‌ కార్డులు ఇచ్చే వారని, ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, ఉచిత కరెంటు ఇవ్వాలని ఆయన కోరారు.  అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, వర్క్‌షెడ్‌ ఏర్పాటు చేయాలని, గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సబ్సిడీ ఇచ్చేవారని, మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మేమంతా మీకు అండదండగా ఉంటామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 
 
Back to Top