రోజుకో అవినీతి, అక్రమాల బాగోతం


అవినీతి అంశాలు పత్రికల్లో రావడంపై బాబు అసహనం
గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ కొనసాగించేందుకు కుట్ర
పాలన వ్యవహారాలను విలేకరులకు ఇవ్వొద్దని ఆదేశం
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న అధికారులు


అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం విచ్చలవిడి దోపిడీ, వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి రోజుకో బాగోతం బట్టబయలవుతుండడంతో...బండారాన్ని బయటకు పొక్కనీయకుండా చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సమాచారన్ని పత్రికల్లో రాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు.  ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్న పత్రికలు, టీవీల గొంతు నొక్కుతూ చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు మోసాలను, స్కాంలను వెలుగులోకి తెచ్చిన పలు పత్రికలు, ఛానళ్లపై చంద్రబాబు తన అక్కసు వెళ్లగక్కారు కూడా. మూడో కంటికి తెలియకుండా దోపిడీ, దందాలు కొనసాగించాలన్న ధోరణిలో చంద్రబాబు ఉన్నారంటే ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. 

అవినీతి, అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు ప్రతిరోజూ వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇరుకున పడుతున్నపచ్చసర్కార్ .... పాలనకు సంబంధించిన సమాచారమేదీ పత్రికల్లో రాకుండా చూడాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు సమీక్షల సమాచారంతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో అవినీతికి సంబంధించిన అంశాలు పత్రికల్లో రావడం రుచించని పచ్చచొక్కాలు...ఇక మీదట విలేకరులకు ఎటువంటి సమాచారం ఇవ్వరాదంటూ ఆదేశాలు జారీ చేయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఆదేశాలతో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ ముని వెంకటప్ప బుధవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు.
 
పాలనలో పారదర్శకతకు పాతర వేస్తూ ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఇటీవలికాలంలో అధికారిక సమాచారం పత్రికల్లో వస్తోందని, ఆర్థికశాఖలోని అధికారులతో సహా ఉద్యోగులెవరూ ఎటువంటి సమాచారాన్నీ విలేకరులకు గానీ, శాఖేతర వ్యక్తులకు గానీ ఇవ్వరాదని మెమోలో స్పష్టం చేశారు. ఎటువంటి సమాచారాన్నిగానీ, డాక్యుమెంట్లనుగానీ పత్రికల వారికివ్వరాదని, అలా ఇచ్చిన వారిపై సర్వీసు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఆర్థికశాఖ ఇటువంటి ఆదేశాల్ని జారీ చేయడంపట్ల ఆ శాఖలోని ఇతర ఉన్నతాధికారులే విస్మయం చెందుతున్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శే పత్రికల వారికి సమాచారమిస్తారని, అయితే ఇతర అధికారులు సమాచారం ఇస్తున్నట్లు మెమో జారీ చేయడమేమిటని వారు తప్పుపడుతున్నారు.
Back to Top