చంద్రబాబు నియంత పాలన..తమ్ముళ్ల అరెస్ట్ లు

అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ లు..
ఫ్లెక్సీ పెట్టాడని రైతుపై పోలీసుల జులుం
వైఎస్ జగన్ కు గోడు వెళ్లబోసుకున్న సత్తిబాబు

రాష్ట్రంలో
చంద్రబాబు పాలన ఎలా ఉందంటే. దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలతో సాగుతోంది.
విచ్చలవిడిగా దోచుకోవడం, తమ అవినీతిని ప్రశ్నించిన వారిపై పోలీసులను
ఉసిగొల్పి కేసులు పెట్టించి వేధించడం జరుగుతోంది.  టీడీపీ సర్కార్
అక్రమాలు, అన్యాయాలను ఎవరైనా నిలదీస్తే చంద్రబాబు జీర్ణించుకోలేక
పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా, ఉప్పలగుప్తం మండలం, కూనవరంలో..తమకు
అన్యాయం జరుగుతోందని ఓ రైతు ప్రశ్నిస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టారు.
అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్ష పార్టీనేతలే కాదు, సొంత పార్టీ
నేతలను చంద్రబాబు అరెస్ట్ లు చేయిస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారు. 

పంట
నష్టపోయినా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని..కూనవరం
గ్రామానికి చెందిన దామిశెట్టి సత్తిబాబు అనే కౌలు రైతు ఓ ప్లైక్సీ ఏర్పాటు
చేశాడు. అంతే, పచ్చనేతల ఆదేశాలతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. టీడీపీ
నేతల దురాగతాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది.  అకారణంగా జైల్లో
పెట్టిన సత్తిబాబును వైఎస్సార్సీపీ నేతలు వెళ్లి విడిపించి తీసుకొచ్చారు.
ఈసందర్భంగా బాధిత రైతు వైఎస్ జగన్ ను కలసి తన గోడు వెళ్లబోసుకున్నారు.
సత్తిబాబు ఏదో నేరం చేసినట్టు అరెస్ట్ చేయడం దారుణమని, ఇంత ఘోరంగా
వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లించదని వైఎస్ జగన్ మండిపడ్డారు. 

సత్తిబాబు
ఫ్లెక్సీ ఎందుకు ఏర్పాటు చేశారంటే.....వ్యవసాయ అధికారులకు విన్నపం. నీలం,
జల్, లైలా తుఫాన్లకు నష్టపరిహారం ఇస్తామన్నారు . ఇంతవరకు పైసా కూడా
ఇవ్వలేదు. కౌలు రైతు రుణాలన్నారు- చిల్లు గవ్వ ఇవ్వలేదు. ఎంపీ,
ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయల వరకు రుణాలిస్తున్నారు. తాము బ్యాంకుకు
వెళితే రూ.5 వేలు కూడా ఇవ్వడం లేదు. కోర్టుకు కోడు అబద్ధాలు చెబుతున్నారు.
మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని సత్తిబాబు ఫ్లెక్సీ
పెట్టాడు. ఫ్లెక్సీలో తాను ఎవరినీ విమర్శించకపోయినా అన్యాయంగా అరెస్ట్
చేశారని సత్తిబాబు వైఎస్ జగన్ కు ఆవేదన చెందారు. ఎస్సై ఎన్ కౌంటర్
చేస్తానని బబెదిరిస్తున్నారని వాపోయారు.

20
ఏళ్లుగా తన కుటుంబం టీడీపీలో ఉందని సత్తిబాబు తెలిపారు. టీడీపీ సభ్యత్వం
ఉన్న ఐడీ కార్డును సత్తిబాబు వైఎస్ జగన్ కు చూపించారు . తనను అరెస్ట్
చేస్తే టీడీపీ వాళ్లు వచ్చి విడిపిస్తారనుకున్నా.  కానీ, వైఎస్సార్సీపీ
నేతలు, రైతులు వచ్చి విడిపించారని సత్తిబాబు చెప్పారు. వారికి నేను
ఎప్పటికీ రుణపడి ఉంటానని సత్తిబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్లుగా
తుపాన్లకు పంట నష్టపోతున్నానని సత్తిబాబు తన ఆవేదనను వెలిబుచ్చారు.
ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ అతనికి భరోసా ఇచ్చారు. ఇటీవలే రాజధాని
ప్రాంతంలో టీడీపీకి చెందిన గద్దె చంద్రశేఖర్ అనే రైతు భూమి ఇవ్వనందుకు
టీడీపీ నేతలు పంటపొలాలు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా తిరిగి వారిపైనే
అక్రమంగా కేసులు బుక్ చేసి వారంరోజుల పాటు చంద్రశేఖర్ కుటుంబసభ్యులను
చిత్రహింసలకు గురిచేశారు. 
Back to Top