వైయస్సార్సీపీలో చేరిన నాయుడుపేట తమ్ముళ్లు

నెల్లూరుః వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. నాయుడుపేట మండలం బిరడవాడకు చెందిన టీడీపీ నీటి సంఘం నాయకుడు పి.  కోటేశ్వరరావు, వార్డు మెంబర్స్ బాలాజి, మల్లికార్జున్ , కాటం సుబ్బయ్య,ఎం. సుబ్బయ్య తదితరులు ఎమ్మెల్యే సంజీవయ్య సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే సంజీవయ్య కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Back to Top