బాబు మాటలతో నష్టపోయిన రైతులు: వైఎస్‌ఆర్‌సీపీ

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి రైతులు తీవ్రంగా నష్ట పోయారని  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సాయిరాజ్ అన్నారు. ఆయన  శ్రీకాకుళం జిల్లాలోని కొర్లాంలో విలేకరులతో మాట్లాడారు.  చంద్రబాబు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేర్చకపోవడంతో ఖరీఫ్, రబీ సీజన్లలో బ్యాంక్ నుంచి రైతులు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ప్రయివేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి సాగు చేపట్టాల్సి వస్తోందన్నారు. హుదూద్ తుపాను పంట నష్ట పరిహారం విడుదల చేసినా చాలా మంది రైతుల ఖాతాల్లో జమకాలేదని ఆరోపించారు
Back to Top