బాబు, కేసీఆర్ అహంకారంతోనే ప్రజలకు చేటు

హైదరాబాద్, అక్టోబర్ 24: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరి అహంకారంతోనే ఉభయ రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉత్పన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఇద్దరు ముఖ్యమంత్రులూ ముందుగానే కూర్చుని మాట్లాడుకుని ఉంటే శ్రీశైలం జలాల వివాదం ఇంత దూరం వచ్చి ఉండేది కాదని పార్టీ శాసనసభాపక్షం కో ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885 అడుగుల మేరకు ఉన్నప్పుడు, పై నుంచి ప్రవాహం ఆగిపోయిన ప్పుడే చంద్రబాబు, కేసీఆర్ లు పరస్పరం సంప్రదింపులు జరుపుకుని నీటి వినియోగంపై ఒక కార్యాచరణ రూపొందించి ఉండాల్సిందని అన్నారు.
 
 ఇద్దరు సీఎంలు, రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులంతా హైదరాబాద్‌లో ఉండి కూడా రాష్ట్ర విభజన వల్ల తలెత్తే ఇలాంటి సమస్యలపై ఆలోచించక పోవడం దారుణమని అన్నారు. శ్రీశైలంలో గత ఏడాది ఇదే రోజున 881 అడుగుల మేరకు నీరుందని, ఇప్పుడు మాత్రం నీటిమట్టం 856 అడుగులకు తగ్గిపోయిందని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందాలంటే 854 అడుగుల మేరకు మట్టం ఉండాలని పేర్కొంటూ.. ఆ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి తాగునీరు కూడా లభించని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.

నీరు అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్న టీడీపీ ప్రభుత్వం.. చివరి దశకు వచ్చాక బోర్డుకు లేఖ రాశామని కంటితుడుపు చర్యగా మాట్లాడుతోందని విమర్శించారు. సీమతో పాటు రాష్ట్ర౦లోని ఇతర ప్రా౦తాలు నష్టపోతాయన్న ఇ౦గితజ్ణాన౦ ప్రభుత్వానికి లేకు౦డా పోయి౦దన్నారు. వైఎస్సార్ హయా౦లో శ్రీశైల౦లో నీటిమట్ట౦ 854 అడుగులకు తగ్గకు౦డా ఉ౦డేలా జీవో ఇచ్చారని, చ౦ద్రబాబు తన గత పాలనలో 834 అడుగుల వరకు ఉ౦డేలా జీవో ఇచ్చారని తెలిపారు. ఇది చాలా దారుణమైన విషయమని అన్నారు.

రాయలసీమలోని కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీకి ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీరివ్వలేదని, తెలుగుగ౦గకు నీటిని కేటాయి౦చలేదని ఆయన ఆవేదన వ్యక్త౦ చేశారు. ఏపీ అసె౦బ్లీలో ప్రతిపక్ష౦గా తాము నిలదీస్తే ప్రభుత్వ౦ తమ గొ౦తు నొక్కి వేస్తు౦దని, వ్యక్తిగత దాడులకు దిగుతో౦దని ధ్వజమెత్తారు. ఇద్దరు సీఎ౦లకు కూర్చుని మాట్లాడుకోమని చెప్పే శక్తి తమకు లేదు కనుక.. దీనిపై జోక్య౦ చేసుకుని ఉభయ రాష్ట్రాల ప్రజలకు మేలు చేయాలని తమ పార్టీ అధినేత జగన్ ప్రధానికి లేఖ రాశారని తెలిపారు.

Back to Top