నాగేందర్‌రెడ్డికి ఎమ్మెల్యే నివాళి

అనంతపురం: నాగేందర్‌రెడ్డి లోటు తీరనిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. విడపనకల్లు మండలం హవగిలి పార్టీ నేత నాగేందర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. మృత్యువార్త తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నాగేందర్‌రెడ్డి కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 
Back to Top