ద‌ళితుల‌కు ద్రోహం చేయ‌వ‌ద్దు

 దళితులకు దళిత మంత్రులు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం బాబూ జగ్జీవన్రాం జయంతి సందర్భంగా పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న‌ మాట్లాడారు. దళితులను పట్టించుకోని వారు ఎవరైనా అధికారం కోల్పోవాల్సిందేనని హెచ్చరించారు. దళితులకు, పేద, బలహీన, బడుగు వర్గాలకు రాజశేఖర్రెడ్డి చేసినన్ని మంచి పనులు మరే నేత చేయలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముమ్మాటికీ దళిత వ్యతిరేకి అని, ఆయన దళితులను విభజిస్తాడని హెచ్చరించారు.

చంద్ర‌బాబు మాటలు వింటూ, ఆయన చెప్పుచేతల్లో ఉంటూ నోరు విప్పకుండా దళిత మంత్రులు ఉంటే ఎంతో మంది బడుగులకు ద్రోహం చేసిన వారవుతారని చెప్పారు. పేదవారికోసం గళం విప్పాలని, దళితుల అవసరాలను ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించాలని హితవు పలికారు. దళితులను పావులుగా వాడుకుంటున్నారని, సబ్ప్లాన్ను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా టీడీపీ మంత్రులు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం దళితులను చిన్న చూపు చూస్తోందని విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top