పరుగుల నాగాంజలిని పట్టించుకోని ప్రభుత్వం


అస్సాం పోటీల్లో పాల్గొనేందుకు షూస్‌ కూడా లేని దీనస్థితి
పబ్లిసిటీ కోసం కొందరికి కలెక్టర్‌ ఉద్యోగాలు, కోట్లు ఇస్తారా..?
నిరుపేద క్రీడాకారులను పట్టించుకోరా చంద్రబాబూ
ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని నాగాంజలికి న్యాయం చేయండి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌
పశ్చిమగోదావరి: నిరుపేద క్రీడాకారులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి చంద్రబాబులో లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పబ్లిసిటీ కోసం కొందరికి కలెక్టర్‌ ఉద్యోగాలు, కోట్లు కుమ్మరించే చంద్రబాబుకు పేద క్రీడాకారులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.  కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన అథ్లెటిక్‌ క్రీడాకారిణి నాగాంజలి వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యను జననేతకు చెప్పుకున్నారు. జాతీయ స్థాయి 800ల మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానం సాధించానని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదన్నారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆల్‌ ఇండియా లెవల్‌ కాంపిటీషన్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించిన కొవ్వూరు నియోజకవర్గ క్రీడాకారణికి ప్రభుత్వం దమ్మిడీ సాయం చేయలేదు.. కొందరికి కలెక్టర్‌ ఉద్యోగాలు.. కోట్ల డబ్బు ఇస్తున్నారు పబ్లిసిటీ వస్తుందని.. ఇలాంటి నిరుపేదలను మాత్రం పట్టించుకోకపోవడం దారుణం. చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి దారుణంగా పాలన సాగిస్తుందనడానికి నాగాంజలి పరిస్థితి నిదర్శనమన్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా జరిగాయి.. ఇప్పుడూ జరుగుతూనే వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని వెంటనే నాగాంజలిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అస్సాం వెళ్లి పరుగులో పాల్గొనేందుకు కనీసం షూస్‌ కూడా లేని స్థితిలో నాగాంజలి ఉందన్నారు. న్యాయం చేస్తాను అధైర్యపడొద్దని.. పరుగులో ముందుకు సాగమ్మా అంటూ వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. 
 
Back to Top