నేడు పులివెందులకు విజయమ్మ

పులివెందుల, 22 మే 2013:

  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే  అయిన శ్రీమతి వైయస్ విజయమ్మ బుధవారం పులివెందులలో పర్యటించనున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందుల చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వేంపల్లెలో తాగునీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటారు. అనంతరం చక్రాయపేట మండలంలోని కె.రాజుపల్లెలో తాగునీటి సమస్య తీర్చనున్న పథకాన్ని ప్రారంభిస్తారు. ఈనెల 23న దివంగత వైయస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాలలో విజయమ్మ పాల్గొంటారు.

Back to Top