'నడిపూరు టూ గుడ్లవల్లేరు' నేటి షర్మిల పాదయాత్ర

నడిపూరు (కృష్ణాజిల్లా), 4 ఏప్రిల్‌ 2013 : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం 111వ రోజు పాదయాత్ర గురువారం నడిపూరు‌ నుంచి ప్రారంభమవుతుందని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ సామినేని ఉదయభాను తెలిపారు. అక్కడి నుంచి ఆమె అగ్రహారం, రెడ్డిపాలెం సెంటర్, వడ్లమానూరు, వేమవరం వరకు పాదయాత్ర చేసిన తరువాత మధ్యాహ్న భోజన విరామం ఉంటుందని చెప్పారు. అనంతరం కౌతవరం క్రాస్ రోడ్డు, గుడ్లవల్లేరు వరకు‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. వడ్లమానూరు, గుడ్లవల్లేరులలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం రాత్రికి శ్రీమతి షర్మిల గుడ్లవల్లేరులో బసచేస్తారు. కాగా, శ్రీమతి షర్మిల గురువారంనాడు మొత్తం 13.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని రఘురాం, ఉదయభాను వెల్లడించారు.
Back to Top