నాలుగోరోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ దీక్ష

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013: విద్యుత్తు
చార్జీల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన
'కరెంటు సత్యాగ్రహం' శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న పలువురి నేతల
ఆరోగ్యం క్షీణించింది. దీక్షలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు చేశారు. కొందరు నేతలు నీరసంగా కనిపించగా,
రక్తపోటులో హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. మరికొందరిలో చక్కెర స్థాయి
ఆందోళనకరస్థాయిలో పడిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి
తరలిస్తామని పోలీసులు చెప్పినా ఎమ్మెల్యేలు నిరాకరించి దీక్ష
కొనసాగిస్తున్నారు.


Back to Top