ప్రభుత్వాలు నిజాయితీగా లేకపోతే ప్రజలకు మేలు జరుగదు :మైసూరారెడ్డి

 వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్.పి డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ...  ఎపి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు తాను ఎపిని రెవెన్యూలోటు నుంచి బయటకు తెచ్చానని
చెప్పుకోవడం కోసం  ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ లోటు
ఉంటే లక్షా పదమూడువేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎలా పెట్టగలిగారని అన్నారు.
ఆర్దిక మంత్రి యనమల తన ప్రకటనలో గతంలో కన్నా ఎపికి ఆదాయం పెరిగిందని,అంచనాల
కన్నా ఎక్కువ వచ్చిందని ఎలా చెప్పారని ప్రశ్నించారు.బడ్జెట్ లెక్కలలో
పారదర్శకత లేదని,తప్పుడు లెక్కలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇది మంచి
పద్దతి కాదని, ప్రభుత్వాలు నిజాయితీగా లేకపోతే అది ప్రజలకు మేలు చేయదని
అన్నారు.

Back to Top