రూ. పది లక్షల పరిహారం ఇవ్వాలి

న్యూఢిల్లీ 26 జూన్ 2013:

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులందర్నీ క్షేమంగా ప్రభుత్వం స్వస్థలాలకు చేర్చాలని కూడా ఆయన కోరారు. తమ పార్టీ వైద్య విభాగం డెహ్రాడూన్‌లో వైద్య సేవలను అందిస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టే వరద సహాయ కార్యక్రమాలు సంతృప్తికరంగా లేవని ఆయన విమర్శించారు.

Back to Top