శ్రీకూర్మనాధున్ని దర్శించుకున్న ఎంవీఎస్‌ నాగిరెడ్డి

గార: శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ విష్ణాలయం శ్రీకూర్మం కూర్మనాధున్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి , రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి  త్రినాధరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ముందుగా మూలవిరాట్‌ను దర్శించుకొని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీహెచ్‌ సీతారామనృసింహాచార్యులు క్షేత్రమహాత్యాన్ని తెలియజేశారు. నాగిరెడ్డి వెంట జిల్లా రైతు విభాగం అధ్యక్షులు గొండు రఘురాం, మండల కన్వీనర్‌ పీస శ్రీహరిరావు, సర్పంచ్‌ బరాటం రామశేషు, యాళ్ల సూర్యనారాయణ, సన్నీ, గంగరాజు తదితరులు పాల్గోన్నారు.

Back to Top