బాబువి మోసపూరిత హామీలు

చిత్తూరు: ఎన్నికల సమయంలో చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చారని, రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కాగానే సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. స్వామినాథన్‌ కమిటీ సిపార్సులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. . ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాలో మొత్తం కరువు మండలాలుగా ప్రకటించారన్నారు. రైయిన్‌ గన్లతో కరువును ప్రారద్రోలానని చంద్రబాబు మోసపూరిత మాటలతో బతుకుతున్నారన్నారు. హెరిటేజ్‌ డైయిరీ కోసం చిత్తూరు డైయిరీనిమూత వేయించారన్నారు. మదనపల్లిలోని టమోట మార్కెట్‌ పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. టమాట రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదన్నారు. ఒక్క రైతుకు కూడా ఈ ప్రభుత్వంలో లబ్ధి జరగలేదన్నారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్‌ అన్నారు. ఎక్కడా కనిపించడం లేదన్నారు. పాడి పరిశ్రమ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పనులు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దౌర్భగ్యమైన పాలన ఎక్కడా చూడలేదన్నారు. రైతుకు ఆత్మసై్థర్యం  ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ భరోసా వైయస్‌ఆర్‌ హయాంలో ప్రతి ఒక్కరికి దొరికిందన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top