ప్రతి నిరుద్యోగికి రూ.2వేలు ఇవ్వాల్సిందే

హైదరాబాద్ః అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు..అవి నెరవేర్చకుండా  మోసం చేశారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  ఈ బడ్జెట్ లోనైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను అంబటి రాంబాబు విడుదల చేశారు.  ప్రతి నిరుద్యోగి ఇంటికి రూ.2వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని వాగ్దానాలను బాబు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

Back to Top