వైయస్‌ఆర్‌ జిల్లాలో ముస్లింల నిరసన ర్యాలీ

వైయస్‌ఆర్‌ జిల్లాః ముస్లిం యువకుల అరెస్ట్‌కు నిరసనగా వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు హఠావో అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగబద్ధంగా పౌరులకు ప్రశ్నించే అధికారం ఉందని,హమీలు నెరవేర్చలేదని అడిగిన ముస్లిం యువకులను పోలీసులతో కొట్టించడం అప్రజాస్వామికమని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలపై అక్రమంగా బనాయించిన కేసులను వెనక్కితీసుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. ముస్లింలకు 2014 ఎన్నికల్లో హమీలను మరిచిన చంద్రబాబు మళ్లీ ముస్లింలను మోసగించే చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
 
Back to Top