ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై ముస్లింల అసమ్మతి


విజయవాడ: తెలుగుదేశం
పార్టీలో చేరిపోయిన విజయ వాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మీద స్థానికంగా అసమ్మతి
పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో అభ్యంతరాలు పెద్ద ఎత్తున వ్యక్తం
అవుతున్నాయి.  జలీల్ ఖాన్ ఆగడాలు
సృష్టిస్తున్నారంటూ ముస్లింలు శనివారమిక్కడ ఆందోళనకు దిగారు. మతతత్వ పార్టీలకు
దూరంగా ఉండాలన్న ఫత్వాను జలీల్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం
చేశారు.

ఇదే
విషయాన్ని శనివారం విజయవాడలో పర్యటిస్తున్న ముస్లిం మతగురువు పీర్ షబ్బీర్ అహ్మద్‑
కు ఫిర్యాదు చేసేందుకు ముస్లింలు యత్నించారు. అయితే  పోలీసులు రంగంలోకి దిగి మత
పెద్దలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


 

తాజా వీడియోలు

Back to Top