అల్లా సాక్షిగా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటాంతూర్పుగోదావరి జిల్లా ముస్లింలు
నగరంలో జననేతను కలిసి వినతిపత్రం అందించిన ముస్లింలు
తూర్పుగోదావరి: అల్లా సాక్షిగా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని తూర్పుగోదావరి జిల్లా ముస్లింలు అన్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్న మహనీయుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. పి. గన్నవరం నియోజకవర్గం నగరంలో కొనసాగుతున్న 198వ రోజు ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముస్లింలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ వల్ల చాలా మంది ముస్లింలు ఉన్నత చదువులు చదివి జీవితాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రతీ ఏడాది 15 వందల మంది డాక్టర్లు, 2 వేల మంది ఇంజినీర్లుగా పట్టాలు పొంది బయటకు వచ్చేవారన్నారు. చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఫీజురియంబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలుకాకపోవడంతో అర్ధాంతరంగా చదువులు మానేయాల్సిన దుస్థితి దాపరించిందన్నారు. ఇమామ్, మౌలానాలకు 8 నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. అదే విధంగా ఉమ్ర బాధితులకు న్యాయం చేయాలని జననేతను ముస్లింలు కోరారు. ప్రజలంతా ముక్తకంఠంతో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అల్లా సాక్షిగా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామన్నారు. 
Back to Top