ముస్లింల‌పై బాబుది క‌ప‌ట ప్రేమ‌

*బాబును ముస్లింలు ఎవ‌రూ న‌మ్మ‌రు
*వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ మెహ‌బూబ్ షేక్‌
క‌ర్నూలు:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముస్లింల‌పై క‌ప‌ట ప్రేమను చూపిస్తున్నార‌ని, బాబును ముస్లింలు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ మెహ‌బూబ్ షేక్ అన్నారు. సూర్యారావుపేట‌లోని త‌న కార్యాల‌యంలో శుక్ర‌వారం విలేక‌రుల‌తో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ముస్లింల ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు బాబు క‌ల్ల‌బొల్లి మాట‌లు చెబుతున్నార‌న్నారు.  2014 ఎన్నికల్లో ఒక్క ముస్లీంకు కూడా సీటు ఇవ్వని, చంద్రబాబు, నేడు ఆయన మంత్రివర్గంలో ముస్లింల‌కు  చోటు ఇవ్వక పోవడం, వారిపట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలుస్తోంద‌న్నారు.  మైనార్టీ కార్పోరేషన్‌కు మూడేళ్లలో ఎన్ని నిధులు కేటాయించారో దాంట్లో ఎన్ని ఖర్చు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్‌పైనే కేటాయింపులని, వాటిని ఖర్చు చేయడం లేదన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మేందుకు ముస్లీంలు అమాయకులు కారని, తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు నంధ్యాల ఓటర్లు సిద్దగా ఉన్నారని పేర్కొన్నారు.
Back to Top