బట్టలూడదీసికొట్టారు

గుంటూరు: శాంతియుతంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపిన తమను పోలీసులు అమానుషంగా అరెస్టు చేశారని ముస్లిం యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలైన అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. గుంటూరు స‌భ‌లో పోలీసులు తమను ఈడ్చుకుంటూ నల్లమడుగు తీసుకెళ్లి బట్టలూడదీసికొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. 2014లో ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నించినందుకు అరెస్టు చేశారని మండిపడ్డారు.ఈ సంఘటనతో ముస్లింలపై చంద్రబాబుకున్న వ్యతిరేకత బటయపడిందని వారు పేర్కొన్నారు.
Back to Top