వైయ‌స్ జగన్‌ను కలిసిన ముస్లిం యువకులువిశాఖః గుంటూరు సీఎం సభలో అరెస్టయిన ముస్లిం యువకులు ప్రజా సంకల్పయాత్రలో జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. తమను అన్యాయంగా అరెస్ట్‌ చేసి హింసించారని ఆవేదన చెందారు. ఇటీవల గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో కొందరు ముస్లిం యువకులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. వారిపై టీడీపీ తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా హింసించింది. వీరికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా నిలిచింది. నిన్న హెచ్ఆర్‌సీకి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి వారు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.  త‌మ‌పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయించాలని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్‌.. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మీపై పెట్టిన కేసులన్నీ మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.
 
Back to Top