వైయస్‌ఆర్‌సీపీ నేతల పేర్లు చెప్పాలని హింసించారు

గుంటూరు:  వైయస్‌ఆర్‌సీపీ నేతల పేర్లు చెప్పాలంటూ పోలీసులు తమను హింసించారని గుంటూరులోని నారా హమారా సభలో అరెస్టు అయి బెయిల్‌పై విడుదలైన 9 మంది ముస్లిం యువకులు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా యువకులు మీడియాతో మాట్లాడుతూ..గుంటూరు మీటింగ్‌లో ముస్లింలకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ డబ్బా కొట్టుకున్నారని తెలిపారు. తనకు అంగవైకల్యం ఉందని చెప్పినా బలవంతంగా పోలీసులు హింసించారని వాపోయారు. ఒక ఉగ్రవాదిని ఎలా శిక్షిస్తారో అలా కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు. ఇష్టానుసారంగా హింసించారని, కడుపులో, నోటి మీద కొట్టారని తెలిపారు. బక్రీద్‌ అని చెప్పినా నీకు ఏం పండుగ అంటూ దాడి చేశారని చెప్పారు. స్టేషన్‌లో, జైల్‌లో తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Back to Top