చాంద్ బాషా రాజీనామాకు డిమాండ్

గుంటూరు(దాచేపల్లి): ముస్లిం మైనార్టీ ఓట్లచే ఎమ్మెల్యే అయిన చాంద్ బాషా టీడీపీలో చేరి ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్ హుస్సేన్ మండిపడ్డారు. చాంద్ బాషా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  రాజకీయ బిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చాంద్ బాషాతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలన్నారు. పార్టీ మైనారిటీ సెల్ మండల కన్వీనర్ సయ్యద్ మౌలాలీ, ఎంపిటిసి సభ్యుడు షేక్ ఖాసీం సైజా, జిల్లా మాజీ కార్యవర్గసభ్యులు షేక్ ఖాదర్ బాషా తదితరులు టీడీపీ అనైతిక రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
Back to Top