వైఎస్ జగన్ తో ముస్లింపెద్దలు

హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని మైనార్టీ విభాగం అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా వెల్లడించారు. ముస్లిం పెద్దలు హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జమాత్ ఇ ఉలేమా ఏ హింద్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. మైనార్టీ రిజర్వేషన్లపై ఈ నెల 18న సుప్రీంలో విచారణకు రానున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని కోరారు. దీని మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని బాషా పేర్కొన్నారు.

 

 

Back to Top