కోటి అన్నారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు

వైయస్‌ జగన్‌ను కలిసి తూ.గో జిల్లా ముస్లింలు
తూర్పుగోదావరి: చంద్రబాబు ప్రభుత్వం తమను అన్యాయం చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా ముస్లింలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి టీడీపీ మోసాలను వివరించారు. పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్ను ముస్లింలు కలిశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. మసీద్‌ల అభివృద్ధికి కోటి రూపాయలు ఇస్తామని రంజాన్‌ సందర్భంగా కలెక్టర్‌ చేతుల మీదుగా మత పెద్దలకు చెక్కు అందజేశారని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. చంద్రబాబు మైనార్టీలకు తుంగలో తొక్కేందుకు చూస్తోందన్నారు. దుల్హన్‌ పథకం, మౌలానా, ఇమామ్‌లకు జీతాలు ఆపేశారని ధ్వజమెత్తారు. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి సంబంధించి ఒక్క మంత్రి కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేకపోవడంతో వైయస్‌ఆర్‌ సీపీ నుంచి అనాగరికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. 
Back to Top