వైఎస్ జగన్ దీక్షకు మునికోటి కుటుంబసభ్యుల మద్దతు..!

గుంటూరుః ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ తిరుపతిలో ఆత్మబలిదానం చేసుకున్న మునుకోటి కుటుంబసభ్యులు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. గుంటూరు నల్లపాడులోని దీక్షా స్థలికి చేరుకొని వైఎస్ జగన్ దీక్షకు తమ సంఘీభావం తెలిపారు.

మునుకోటి ఆత్మహత్యపై  ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై వారు మండిపడ్డారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తమ కుటుంబాన్ని పరామర్శించారని మునికోటి కుటుంబసభ్యులు తెలిపారు. జగన్ దీక్షకు తము సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రత్యేకహోదా రాదేమోనన్న బెంగతో కొద్ది నెలల క్రితం తిరుపతిలో మునికోటి ఆత్మహత్య చేసుకున్నారు. 

రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాధించేందుకు అమరుల సాక్షిగా వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర ప్రజానీకమంతా వెల్లువలా తరలివచ్చి వైఎస్ జగన్ దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. 
Back to Top