మైనార్టీల మనోభావాలు దెబ్బతీయడం తగదు

చిత్తూరు(మదనపల్లె): మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం తగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లూరి షమీం అస్లాం ఆవేదన వ్యక్తం చేశారు.  బెంగళూరు రోడ్డులోని ప్రెస్‌క్లబ్‌లో వైయస్‌ఆర్‌సీపీ కార్మిక విభాగం జిల్లా ఉపాధ్యక్షులు షరీఫ్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు..షమీం మాట్లాడుతూ న్యాయస్థానాలన్న, న్యాయవ్యవస్థన్న తమకు అపారమైన గౌరవం ఉందని కానీ అలహాబాద్‌ హైకోర్టు తలాక్‌ విషయంలో తీసుకున్న నిర్ణయంపై తాము ఆవేదన చెందుతున్నామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్, నెహ్రూ లాంటి వారే భిన్నత్వంలో ఏకత్వమని భావించి ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని గుర్తు చేశారు.

కానీ నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. తలాక్‌ విషయం ఏ న్యాయస్థానమైన ముస్లిం మత పెద్దల అంగీకారం, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందన్నారు. గత 70 ఏళ్లుగా గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేదని ఆమె గుర్తు చేశారు. ముస్లింల మనోభావాలను గౌరవించేలా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వ్యవహరించాలని ఆమె విజ్ఞిప్తి చేశారు.
Back to Top