విజయవాడ మున్సిపల్ హాల్ కౌన్సిలర్ల దీక్ష

విజయవాడ మున్సిపల్ కౌన్సిల్
సమావేశంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఇద్దురు కార్పొరేటర్లను ఏకపక్షంగా
సస్పెండ్ చేయడం తదుపరి , ఆందోళనలతో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
సస్పెన్షన్ ను నిరసిస్తూ రాత్రి పొద్దు పోయేంత వరకు కూడా  కౌన్సిల్ హాలోనే దీక్షలు చేపట్టడంతో, వారికి
పార్టీ సీనియర్ నేతలు కూడా  బాసటగా
నిలిచారు. తమపై అకారణంగా సస్ఫెన్షన్ విధించిన మేయర్ శ్రీధర్ వచ్చి క్షమాపణ చెప్పేవరకు
నిరసన కొనసాగిస్తామని కార్పొరేటర్లు స్పష్టం చేశారు.

గురువారం ఉదయం జరిగిన
కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనపై స్పందిస్తూ
ఇదే అంశంలో చంద్రబాబు అవలంబిస్తున్న రెండు నాలుకల ధోరణిపై కూడా చర్చ జరగాలంటూ  వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు షేక్
బీజన్ బీ, జమల పూర్ణమ్మ లునిలదీయంతో, మేయర్ వారిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం
వివాదాస్పదమైంది. మేయర్ వైఖరికి నిరసనగా వీరిరువురు హాల్ లోనే దీక్షకు పూనుకోగా,
మిగిలిన కార్పొరేటర్లు వీరికి మద్దతుగా దీక్షలో కూర్చోడంతో పరిస్థితి ఉద్రిక్తంగా
మారింది.

రాత్రి పొద్దుపోయేంత వరకు
కూడా వీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
చేస్తున్నారు. కార్పోరేటర్ల ఆందోళనకు వైయస్ఆర్సీపీ నేతలు వెల్లం పల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, తదితరులు మద్దతు పలికారు. 

Back to Top