వైయ‌స్ఆర్‌సీపీలోకి ముల్లంగి సోదరులుఅనంతపురం:  రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలోని బొమ్మనహాళ్‌ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్‌ నాయుడు, లింగదహాళ్‌ సర్పంచ్‌ లింగప్పలు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి , రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య, అనంతపురం అర్బన్‌ సమన్వయకర్త, మాజీ ఎంపీ అనంత వెంకటరామి రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి ,  ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాములు, హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం,  నియోజకవర్గాల సమన్వయకర్తలు వై. వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి,  పార్టీ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి, అనిల్‌ చౌదరిల స‌మ‌క్షంలో వారు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కుమారుడు భీమరెడ్డి,  బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వీరాంజినేయులు, కదలిక ఇమాం, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఉసేన్‌ పీరా , రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, ఎస్టీ, ఎస్సీ , బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు భోజరాజు నాయక్, బీటీపీ గోవిందు, ఎన్టీ సిద్దప్ప  పాల్గొన్నారు. 

Back to Top