ముఖ్యమంత్రి కిరణ్‌కు ఓర్పు లేదు: మైసూరారెడ్డి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి ఓర్పు ఉండాలని, అలాంటి గుణం ఉన్నవారు మాత్రమే రాణిస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి అన్నారు. అయితే, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం అలాంటి ఓర్పు లేనే లేదని ఆయన వ్యాఖ్యానించారు. సాక్షి టివి 'ప్రైమ్‌టైమ్ షో‌'లో పాల్గొన్న మైసూరారెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఉదంతంపై మాట్లా‌డారు.

ఈ సందర్భంగా మైసూరా మాట్లాడుతూ, ‘ఢిల్లీలో 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా కిర‌ణ్ తీవ్ర అసహ‌నం ప్రదర్శించారు. అక్బరుద్దీన్ విషయాన్ని ‌సిఎం కిరణ్ కొంత వ్యక్తిగతంగానే తీసుకున్నట్లుగా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై గవర్నర్‌తో కిరణ్ సమాలోచనలు జరపడం, ప్రసంగం ‌సిడిలను తయారుచేసి బయటికి పంపడం, సంక్లిష్టమైన సెక్షన్లను కేసులో పెట్టడం వంటి అంశాలన్నీ గమనిస్తే ప్రభుత్వ జోక్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఒక విధంగా రాజకీయ జోక్యమే’ అని చెప్పారు.
Back to Top