ముచ్చర్లలో జెండా ఆవిష్కరించిన షర్మిల

ముచ్చర్ల (ఖమ్మం జిల్లా), 1 మే 2013: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లాలో బుధవారం పాదయాత్రను పునప్రారంభించారు. ముచ్చర్ల నుంచి ఆమె తన పాదయాత్రను ప్రారంభించారు. మేడే సందర్భంగా శ్రీమతి షర్మిల ముచ్చర్లలో జెండాను ఆవిష్కరించారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 135వ రోజు బుధవారంనాడు అడవిమద్దలపల్లి, లాలయ్య తండా, మర్సగుంట, శ్రీరామపురం తండా, తిమ్మారావుపేట, రాజలింగాలలో కొనసాగుతుందని పార్టీ కార్యక్రమాల కమిటీ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

రెండు రోజుల విరామం తరువాత నేడు షర్మిల యాత్ర ప్రారంభం :
శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రెండురోజుల విరామం అనంతరం బుధవారం ఉదయం పునఃప్రారంభమైంది. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో ‌అంటకాగుతూ కొమ్ము కాస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తీరుకు నిరసనగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో సాగుతోంది.
ఈ క్రమంలో బూడిదంపాడు వద్ద శ్రీమతి షర్మిల ఎడమ కాలు మడమ బెణికి గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ముచ్చర్ల శివారులో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న శ్రీమతి షర్మిల బుధవారం పాదయాత్ర పునఃప్రారంభించారు. మంగళవారం అపోలో ఆసుపత్రి వైద్యుడు సిఎస్ రెడ్డి శ్రీమతి షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారని, గాయం 95 శాతం నయమైందని, మెల్లగా నడక ప్రారంభించవచ్చని సూచించారని రఘురాం చెప్పారు.
Back to Top