వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీటీసీలు


కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీటీసీలు క‌లిశారు. గోప‌వ‌ర‌పుగూడెం వ‌ద్ద ఎంపీటీసీలు ప్ర‌తిప‌క్ష నేత‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించారు.   ప్రోటోకాల్ పాటించ‌కుండా టీడీపీ నేత‌లు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. త‌మ‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయించి వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీ సుకెళ్లారు. నీరు- చెట్టు పేరుతో కోట్లాది రూపాయలు కొల్ల‌గొడుతున్నార‌ని పేర్కొన్నారు. జ‌న్మ‌భూమి క‌మిటీలు సిఫార్సు చేసిన వారికే పింఛ‌న్లు ఇస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ ..మ‌రో ఏడాదిలో మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, ఎలాంటి సంక్షేమ ప‌థ‌క‌మైనా 72 గంట‌ల్లో ల‌బ్ధిదారుల‌కు అందేలా గ్రామ స‌చివాల‌యాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ర‌ద్దు చేస్తామ‌ని మాట ఇచ్చారు. ప్ర‌జా ప్ర‌తినిధుల హ‌క్కుల‌ను కాపాడుతామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో ఎంపీటీసీలు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Back to Top