ఢిల్లీలో ఎంపీలు వాక్ విత్ జ‌గ‌న‌న్న‌

న్యూ ఢిల్లీ:

రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకోవడానికి వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న నేపథ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు  ‘వాక్‌ విత్‌ జగనన్న’ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు.  సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌టంతో స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వెళ్లిన పార్టీ ఎంపీలు ఢిల్లీలో డాక్ట‌ర్  బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి వైయ‌స్ జ‌గ‌న్‌కు సంఘీభావంగా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది నవంబరు 6న ఇడుపులపాయలోని తన తండ్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నుంచి కాలినడకన రాష్ట్ర పర్యటనకు బయల్దేరార‌ని, ఇప్పటికే ఆయన వైయ‌స్ఆర్ జిల్లా,  కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించార‌న్నారు.  ఇవాళ‌ నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో వైయ‌స్ జగన్‌ 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేసుకోనున్నార‌ని చెప్పారు.  వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని, ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు చెప్పుకొని సాంత్వ‌న పొందుతున్నార‌న్నారు. టీడీపీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని, రాజ‌న్న రాజ్యం రావాల‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నార‌ని చెప్పారు.

Back to Top