న్యూఢిల్లీ: ప‌్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగి వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రెండో రోజు ఆమరణ దీక్షలో ఉన్న సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలే వైయస్ఆర్ సీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. గతంలో చెప్పిన విధంగానే రాజీనామాలు చేశామని చెప్పిన ఆయన, హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.