ఫాతిమా విద్యార్థుల‌కు న్యాయం చేయండి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కడప ఫాతిమా కాలేజీ విద్యార్థుల వ్యవహారంపై మంత్రితో చర్చించారు. బాధిత విద్యార్థులకు న్యాయం చేసేలా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని సుబ్బారెడ్డి వినతిపత్రం అందజేశారు. కేళర, పాండిచ్చేరిలో సూపర్‌ న్యూమర్‌ సీట్లు సృష్టించి విద్యార్థులకు న్యాయం చేశారని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి సుప్రీంకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేస్తామని చెప్పారు. 
  
Back to Top