ఇదేమి ప్రభుత్వం

ఒంగోలు)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒంగోలు లో మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీ మహిళల్ని
ఉద్యోగాల్లోంచి తీసేయాలన్న ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు
ఊదరగొట్టారని, ఇప్పుడు ఇంటికో ఉద్యోగం తీసేస్తున్నారని వైవీ
సుబ్బారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యుల తీరు దారుణమని ఆయన
వ్యాఖ్యానించారు. సభ కార్యకలాపాల వీడియోల్ని ఏకపక్షంగా విడుదల చేశారని ఆయన
మండిపడ్డారు. 

Back to Top