రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంతో బాబు విఫలం

ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదు
స్పష్టత రాకపోతే పార్టీ అధినేతతో మాట్లాడి తదుపతి నిర్ణయం
ఢిల్లీ: రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆంధ్రరాష్ట్రానికి ఇచ్చిన హామీఅలను అమలు చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల నిరసన కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైవీ మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే లోపు విభజన చట్టంలోని ముఖ్యమైన అంశాలు ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ ప్లాంట్, దుగ్గరాజుపట్నం పోర్టు వంటి అంశాలపై క్లారిటీ ఇచ్చే విధంగా కేంద్రంపై పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు. అప్పటికీ కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకొని పోరాటం ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షం ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం ప్యాకేజీ కోరుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం జరుగుతూనే ఉంటుందని చెప్పారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలు నుంచి రాష్ట్రంలో సమస్యలు, విభజన చట్టంలోని అంశాలపై వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. 
Back to Top