బ్రెజిల్ లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పర్యటన

బ్రెజిల్: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ
సుబ్బారెడ్డి పర్యటిస్తున్నారు. ఫోరమ్ బ్రెజిల్ ఇండియా అనే ఫోరమ్ లో భారత
ప్రతినిధిగా ఆయన పాల్గొంటున్నారు. జెబు మ్యూజియం ఆధ్వర్యంలో ఏబీసీజడ్ మెయిన్ హాల్
లో ఈ ఫోరమ్ ను నిర్వహిస్తున్నారు. గుజరాత్ నుంచి జెబు తెగ పశువుల్ని బ్రెజిల్ కు
తీసుకొని వెళ్లటం జరిగింది. అక్కడ వ్రద్ధి చెందిన జెబు తెగ పశువుల విస్తరణ మీద
చర్చ జరిగింది. తర్వాత కాలంలో జెబు, ఒంగోలు తెగ పశువుల్ని భారత్ లో విస్తరించటం
తద్వారా రెండు దేశాల్లోనూ పశు సంపద వ్రద్ధి అవుతుందని భావించటం జరిగింది. పశుజాతి
ప్రవర్ధనం దిశగా టెక్నాలజీ, సౌకర్యాలు, ఇతర వసతుల విషయంలో ఇచ్చి పుచ్చుకోవాలని
రెండు దేశాలు భావించటం జరిగింది.



            ఈ
సందర్బంగా ఏబీసీజడ్ అధ్యక్షులు లూయిజ్ క్లాడో పరాన్హోస్ మాట్లాడుతూ.. రెండు దేశాల
ప్రయోజనం రీత్యా జెబూ, ఒంగోలు జాతి పశు సంపదను వ్రద్ధి చేయాలని అభిలషించారు.
టెక్నాలజీ, పోషక నిర్వహణ, పశువుల ఆరోగ్యం, జన్యు ప్రతిపత్తి వంటి అంశాల్లో పరస్పర
సహకారం అభిలషణీయం అని పేర్కొన్నారు. ఈ ఫోరమ్ లో బ్రెజిల్ లో భారత రాయబారి సునీల్
లాల్, భారత కాన్సులేట్ ప్రతినిధి ఎల్సో డీ బరాస్ గోమ్స్ జూనియర్ తదితరులు
పాల్గొన్నారు. 

Back to Top