లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు

న్యూఢిల్లీ: పులివెందులలో ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జరిగిన ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి రౌడీషీటర్లను తీసుకొని తాను మాట్లాడుతుండగా మైక్‌ లాక్కున్నారని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నా చేతిలోని మైక్‌ లాక్కునే యత్నం చేశారని అవినాష్‌రెడ్డి స్పీకర్‌కు తెలిపారు. ఎంపీ అన్న గౌరవం కూడా ఇవ్వకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించారని చెప్పారు. రౌడీషీటర్లపై చర్యలు తీసుకోవాలని అవినాష్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top