గిరిజన సలహా మండలి ఏర్పాటుపై తాత్సరం ఎందుకు?

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సలహా మండలి ఏర్పాటులో జాప్యంపై రాజ్యసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ కింద గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని గుర్తు చేశారు. అయితే ఏపీలో ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా తాత్సరం చేస్తోందని సభ దృష్టికి తెచ్చారు. ఈ నిర్లక్ష్యంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి ఓరమ్‌ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సలహా మండలి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ఓరమ్‌ సమాధానం చెప్పారు.

Back to Top