వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావిస్తాం

న్యూ ఢిల్లీ:  ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చిన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా ఢిల్లీలో ఎంపీలు వాత్ విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న  మీడియాతో మాట్లాడారు. టీడీపీ విభజన హామీలు వదిలేసి అసెంబ్లీ సీట్లను అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిరాయింపుల ప్రోత్సాహానికే సీట్ల పెంపును తెస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, పోలవరం, దుగ్గరాజుపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ అంశాలను సమావేశాల్లో లేవనెత్తుతామని విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
Back to Top