బాబు ఎవరిని కలిశారు..ఎందుకు కలిశారు?


ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిన్న రాత్రి చంద్రబాబు ఎవరిని కలిశారు? ఎందుకు కలిశారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిన్న రాత్రి చంద్రబాబు కొన్ని రహస్య సమావేశాలు నిర్వహించారని, అందులో ఏం లావాదేవీలు జరిగాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాత్రి కొంతమందిని చంద్రబాబు రహస్యంగా కలిశారన్నారు.  వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు, టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా టీడీపీ ఎంపీలు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. సభలో చర్చ జరిగితే బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. 

 

  
 

తాజా ఫోటోలు

Back to Top